Madanapalle: మదనపల్లెలో ట్రాఫిక్ సిగ్నల్స్, ఫుట్‌పాత్‌ల ఏర్పాటుకై మునిసిపల్ మేనేజర్‌కు బహుజన యువసేన వినతిపత్రం. రోడ్డు ఆక్రమణల తొలగింపునకు డిమాండ్.

0
1

Madanapalle: మదనపల్లె పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని, పాదచారుల భద్రత కోసం ఫుట్‌పాత్‌లు నిర్మించాలని కోరుతూ బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్, మునిసిపల్ కమిషనర్ గారు అందుబాటులో లేని కారణంగా మునిసిపల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, బెంగళూరు రోడ్డు, సీటీఎం రోడ్డు తదితర ప్రధాన కూడళ్లలో ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని, రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి ఫుట్‌పాత్‌లు నిర్మించాలని, జీబ్రా క్రాసింగ్‌లు, ట్రాఫిక్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ట్రాఫిక్ సమస్యల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ల రాకపోకలకు కూడా ఆటంకాలు కలిగే ప్రమాదం ఉందని పునీత్ కుమార్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు మునిసిపల్ అధికారులు, సంబంధిత శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకొని, మదనపల్లె ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.