● కౌకూర్‌లో బాధిత కుటుంబానికి పరామర్శ
● న్యాయం జరగాలని ఆకాంక్ష
అల్వాల్, అక్టోబర్ 13: కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్‌లో హత్యకు గురైన ఐదేళ్ల చిన్నారి ఆరేలియా అలియాస్ మోను కుటుంబాన్ని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ విషాద సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారి హత్యోదంతంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రూ.20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ దారుణ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ పరామర్శలో బీఆర్ఎస్ నాయకులు జె.ఏ.సీ. వెంకన్న, మేకల రాము యాదవ్, లక్ష్మణ్ యాదవ్, అల్లి శ్రీనివాస్, లియోనార్డ్, వెంకటేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, సురేష్, తిరుపతిరావు, శ్రీనివాస్, శోభ, రమేష్, విజయ్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, హనుమాన్ చారి, గౌస్ ఇమ్రాన్, వినీత్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal









