తెనాలి మున్సిపాలిటీ అన్ రిజర్వుడ్….

0
3

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు పురపాలక సంఘాల రిజర్వేషన్లకు ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందులో భాగంగా తెనాలి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని అన్ రిజర్వుడ్ కేటగిరికి కేటాయించారు. దీంతో అన్ని సామాజిక వర్గాల వారు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు అవకాశం లభించింది. రిజర్వేషన్ల ప్రక్రియతో తెనాలి పట్టణంలో రాజకీయ కోలాహలం మొదలైంది. అవకాశావాదులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.