పుంగనూరు పట్టణం ప్రైవేట్ బస్టాండ్ పక్కలో వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారు వేపాకు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు, మురళి అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి, వేపాకుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మహా కర్పూర హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి విశేష అలంకారాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు మురళి తెలిపారు# కొత్తూరు మురళి.










