కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గుండి నూతన పంచాయతీ కార్యదర్శి వికాస్‌కు ఘన సన్మానం

0
3

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): గుండి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బదిలీపై గుండి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విచ్చేసిన చంద్రి వికాస్ గారిని, పార్టీ నాయకులు మరియు యువకులు. మర్యాదపూర్వకంగా కలుసుకున్న అనంతరం కాంగ్రెస్ పార్టీ  సభ్యులు, ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామా ఆభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మోహూర్లే విశ్వనాథ్, ఆసిఫాబాద్ మండల వార్డు మెంబర్స్ ఫోరం అధ్యక్షులు బట్టుపల్లి ప్రవీణ్ చారి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ దాన్పెల్లి శ్యామ్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బట్టుపల్లి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోలే సంతోష్, శ్రీరామ్ సతీష్, కాంగ్రెస్ పార్టీ యువకులు బట్టుపల్లి సంతోష్, బట్టుపల్లి తిరుమలేష్, సాంగ్డే సాయి తదితరులు పాల్గొన్నారు.