● సీవరేజీ పైప్లైన్, సీసీ రోడ్ల పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్, అక్టోబర్ 14: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి భీంరావు నగర్, జానకి నగర్, ఆనందరావు నగర్ కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆయా కాలనీల్లో సీవరేజీ పైప్లైన్, సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా ప్రమాణాలను పాటించాలని ఆమె సూచించారు.
అభివృద్ధి పనులు పూర్తయితే కాలనీవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు రోజువారీ రాకపోకలకు సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో గిరి, ప్రశాంత్, యాదగిరి, ప్రేమ్, సాజిద్, మహేందర్ ఆమె వెంట ఉన్నారు.
#sidhumaroju
Alwal
L










