శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో రెండు రోజులపాటు నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, టీమ్వర్క్ను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులను ఉన్నత స్థాయి పోటీలకు సిద్ధం చేసేందుకు సింగరేణి సంస్థ ప్రోత్సాహం అందిస్తోందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరినీ అభినందిస్తూ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.










