జైపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా

0
1

జైపూర్: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం జైపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధుల తీరు, సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల నమోదు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వహించరాదని, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్‌లో 5S మేనేజ్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తూ పరిసరాలు, రికార్డులు, ఫైళ్లను పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి సీసీటీఎన్‌ఎస్‌పై పూర్తి అవగాహన ఉండాలని, ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో హెచ్చరిక బోర్డులు, రహదారి సూచికలు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయించాలని సీపీ ఆదేశించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగించకపోవడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ తనిఖీలో జైపూర్ ఏసీపీ ఆర్. వెంకటేశ్వర్లు, సీఐ నవీన్ కుమార్ పాల్గొన్నారు.