జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన

0
3

  కరీంనగర్ జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో పోర్ట్ ఇవి సోలార్ కంపెనీ ఛానల్ పార్ట్నర్  జీవ సోలార్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఆధారంగా యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం  కశ్మీర్ గడ్డ  ఉపాధి కల్పన ఆవరణ యందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. టెలి కాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్, అసిస్టెంట్ మేనేజర్ వివిధ రకాల పోస్టులకు ఇంటర్వులు నిర్వహించి సోలార్ పై అనుభవం గల యువతీ యువకులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోర్ట్ టీవీ సోలార్ పార్ట్నర్స్ , లాజర్, రాజేశ్వరరావు , మేనేజర్ పోగుల రవికుమార్, మార్కెటింగ్ సేల్స్ ఏ. సతీష్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ టి. సదానందం తదితరులు పాల్గొన్నారు.