🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి):
ఆసిఫాబాద్ సిఐ నీలం రవికి గారికి డివైఎఫ్ఐ (DYFI) వినతి
డివైఎఫ్ఐ (DYFI) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ సిఐ నీలం రవి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆసిఫాబాద్ మండల కేంద్రంలో గల గ్రామాల యందు పత్తి చేనులో గంజాయి మొక్కలు పెంచుతూ దానిని కోతకు వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాలకు కొంతమంది గంజాయి స్మగ్లర్లు యువతను టార్గెట్ చేసుకొని వారికి విక్రయిస్తున్నారు.
యువత గంజాయి బారిన పడి తమ కుటుంబాలకు దూరమై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా మహిళలపై, అమ్మాయిలపై గంజాయి మత్తులో మానసిక దాడి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో యువతకు పూర్తి అవగాహన సదస్సులు నిర్వహించి గంజాయి మత్తున పడకుండా కాపాడాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గొడిసెల కార్తీక్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గేడం టీకానందు, జిల్లా కోశాధికారి దుర్గం నిఖిల్ హాజరయ్యారు.










