బెంగళూరులోని ఓ పబ్లో పోలీసులతో గొడవపడిన ఘటనలో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్పై బదిలీ వేటు పడింది. ‘కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ (కాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయనను వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. ‘కాడా’ ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్టుకు వెంటనే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్కు సూచించారు.
అక్టోబర్ 10న తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న ఓ పబ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు, వయసు నిర్ధారణ కోసం కస్టమర్ల గుర్తింపు పత్రాలు అడిగారు. ఈ క్రమంలో వికాస్ మర్మత్, ఆయన స్నేహితులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారిని దూషించి విధులకు ఆటంకం










