అబ్దుల్ కలాంకు ఘన నివాళి: స్ఫూర్తి శిఖరమన్న చంద్రబాబు, ఆదర్శమన్న పవన్ కల్యాణ్.

0
1

భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి, సమాజానికి కలాం అందించిన అసమాన సేవలను వారు స్మరించుకున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలాంను “స్ఫూర్తి శిఖరం”గా అభివర్ణించారు. ఆయన ఒక అరుదైన వ్యక్తిత్వమని, భారత అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికుడని కొనియాడారు. కలాం జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ‘ఎక్స్’ వేదికగా ఆయన పిలుపునిచ్చారు.