తెనాలి బోసు రోడ్డు లోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా గురువారం శ్రీ ధనలక్ష్మి, శ్రీ గజలక్ష్మి దేవి అలంకారాలతో భక్తులకు దర్శనమిచ్చారు.చలనచిత్రం నటుడు అమ్మవారిని దర్శించుకున్న తదనంతరం బండ్ల గణేష్ మాట్లాడుతూ గుడి గురించి అమ్మవారి గురించి చాలాసార్లు నాకు వివరించడం జరిగింది. ఇచ్చట వాసవి అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారిని తెలిపారు. దసరా ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరుగుతాయని బ్రహ్మాండంగా హోమాలు,పూజలు జరుగుతాయని చాలామంది నాకు చెప్పడం జరిగింది.తెనాలి రావడం ఇదే మొదటిసారి. తెనాలి కళాకారులకు జన్మనిచ్చిన ప్రదేశమని ఇచట నుంచీ ఎంతోమంది కళాకారులు నటీనటులుగా రాణించారని తెలుసు. కళాకారుల పట్టణంగా తెనాలి గురించి వినటం జరిగిందన్నారు. అమ్మవారిని దర్శించుకోవటం మిమ్మల్ని కలవడం చాలా ఆనందదాయకమని, అమ్మవారిని చూడగానే ఒక కోరిక కోరుకున్నాను తప్పకుండా అమ్మవారు ఆ కోరికను నెరవేరుస్తుందని నమ్మకం పెరిగింది.మరల దసరాకి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని మరియు మొక్కు చెల్లించుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Home Andhra Pradesh తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజలు చేసిన నటుడు నిర్మాత బండ్ల గణేష్.










