Madanapalle: మదనపల్లె వద్ద బొలెరో, తుఫాన్ వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

0
1

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బొమ్మనచెరువు వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తిమీరను తరలిస్తున్న బొలెరో వాహనం తుఫాన్ వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతి చెందినవారు రామసముద్రం మండలం చెంబకూరుకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.