Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు ప్రసిద్ధ శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

0
1

Punganur: జగన్మాత దుర్గాదేవి మరోవతారం శాకంభరీ దేవిగా శ్రీ బోయకొండ గంగమ్మ ఓం నారాయణ్యై విద్మహే శాకంభరీ దేవ్యై ధీమహి | తన్నో దేవీ ప్రచోదయాత్ ||” సృష్టిలోని సకల జీవరాశులను తన శరీరం నుండి ఉద్భవించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో రక్షించిన కరుణామయి, జగన్మాత దుర్గాదేవి అవతారమే శాకంభరీ దేవి. “నారాయణీ స్వరూపిణి అయిన ఆ శాకంభరీ దేవిని మేము తెలుసుకుంటున్నాము. ఆ అమ్మవారిని మేము ధ్యానిస్తున్నాము. ఆ దేవి మా బుద్ధిని సన్మార్గంలో ప్రచోదనం చేయుగాక (నడిపించుగాక).” శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో నాలుగవ రోజు అమ్మవారి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అభిషేకములు నిర్వహించి శాకంబరీ దేవిగా అలంకరించారు. ఆలయ వేద పండితులు గోవర్ధన శర్మ ఆధ్వర్యంలో నవగ్రహ గణపతి చండీ హోమాలను వేదమంత్రోచ్ఛారణలతో ఉభయ దారులతో నిర్వహించ నున్నారు.