పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి తాళాసు శ్రీపద్మను ఎంపిక చేయడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ శ్రీ పి.వి. సతీష్ గారి సతీమణి అయిన శ్రీపద్మ ఉన్నత విద్యావంతురాలు, సుగుణశీలి, ప్రజా సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు నాయకులు పేర్కొన్నారు.
పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకత్వ లక్షణాలు కలిగిన మహిళకు అవకాశం కల్పించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, పలాస నియోజకవర్గ ఇన్-ఛార్జ్, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి పలువురు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అర్హత, సామర్థ్యం కలిగిన అభ్యర్థిని ఎంపిక చేయడం ద్వారా పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతోందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో శ్రీమతి తాళాసు శ్రీపద్మ ఘన విజయం సాధించి, పలాస-కాశీబుగ్గ పట్టణ అభివృద్ధికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.










