మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కొత్త ఓటర్ నమోదు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) వేణు మాట్లాడుతూ.. గ్రామంలో Form-6 కింద మూడు కొత్త దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సమ్మరీ రివిజన్ నడుస్తోందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకులు తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు.ఓటర్ జాబితాలో పేరు లేనివారు, కొత్తగా పెళ్లయి గ్రామానికి వచ్చిన మహిళలు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, అడ్రస్ మారిన వారు Form-6, Form-7, Form-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే ఓటర్ ఐడీలో పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఫోటోలో తప్పులు ఉన్నవారు సరిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశం అని పేర్కొన్నారు. ఆధార్ అనుసంధానం కూడా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.










