హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్!

0
1

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద బైక్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో టైలర్ మైబు రాజు గాయపడ్డారు.

చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సింగభూపాలెంకు చెందిన టైలర్ మైబు రాజు బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఆయన గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొత్తగూడెం పట్టణ సీపీఎం కార్యదర్శి లిక్కి బాలరాజు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. క్షతగాత్రుడికి సహాయం అందించేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి, సిబ్బంది సహాయంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సకాలంలో సహాయం అందించడంతో లిక్కి బాలరాజు మానవత్వాన్ని చాటుకున్నారని పలువురు అభినందించారు.