ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (భారత్ ఆవాజ్ న్యూస్):
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల (Govt. Medical College) లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను పారామెడికల్ బోర్డు నుండి రెండు సంవత్సరాల కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా కళాశాలలో అందుబాటులో ఉన్న పారామెడికల్ కోర్సుల వివరాలు:
• DMLT కోర్సు: 30 సీట్లు
• DECG కోర్సు: 30 సీట్లు
అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు పారామెడికల్ బోర్డు అధికారిక వెబ్సైట్ www.tgpmb.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.










