AP: ఏపీలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న 4 రోజులు భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

0
1

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు.