Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల; అక్టోబర్ 16 నుంచి నామినేషన్లు, 28న పోలింగ్, 30న లెక్కింపు చేపట్టనున్నారు.

0
1

Madanapalle: మదనపల్లె పురపాలక సంఘం చైర్‌పర్సన్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారిక షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన ఎన్నికల కార్యక్రమం ప్రకారం అక్టోబర్‌ 28న పోలింగ్‌ నిర్వహించనుండగా, 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు మదనపల్లె మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి, కమిషనర్‌ కే.ప్రమీల గురువారం ఎన్నికల ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి స్పష్టత రావడంతో ఆశావహులు, రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది.