సూర్య సామైక్య సంఘం ఆధ్వర్యంలో దేవీమాత పల్లకి ఊరేగింపును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని పూలమాలలతో అలంకరించి పల్లకిపై ప్రతిష్ఠించి ఊరేగించారు. కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిగీతాల ఆలాపన, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య పల్లకి ఊరేగింపు కొనసాగింది.










