పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ కేంద్రం వద్దకు కాన్వాయ్ వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని కొందరు అడ్డుకున్నారు. పరస్పరం రాళ్ల దాడి జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని నామినేషన్ కేంద్రంలోని ఓ రూములోకి తీసుకెళ్లారు. బయట ఉన్న ఎంపీ కాన్వాయ్ వాహనాలు ధ్వంసం చేశారు. తర్వాత ఎంపీ ఉన్న రూము పైకి రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి DSP గాల్లోకి కాల్పులు చేసినట్లు సమాచారం.










