శ్రీరాంపూర్: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరాంపూర్ ఏరియాలోని SRP OC, SRP-3 గనుల పరిధిలో ఉన్న మైసమ్మ ఆలయాల్లో చండీయాగం, మహా అన్నదాన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా INTUC సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, బెల్లంపల్లి రీజియన్ ఇన్చార్జి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మన్న, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కలవేన శ్యామ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం INTUC నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ కార్మికుల సంక్షేమం, శ్రేయస్సు కోసం INTUC నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి అభ్యున్నతికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని INTUC శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ ఉపాధ్యక్షుడు శీలం చిన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో SRP OC పిట్ కార్యదర్శి ఓరం జగన్, జనరల్ సెక్రటరీ జీవన్ జోయల్, కేంద్ర నాయకులు ఎంబడి సంతోష్, ఏరియా నాయకులు గణపతి మహేష్, SRP-3 పిట్ కార్యదర్శి గోపాల్ రెడ్డి, బ్రాంచ్ నాయకులు వీరమల్లు, యూత్ వింగ్ కన్వీనర్ ఏల్పుల ప్రవీణ్తో పాటు మనోజ్ వర్మ, ఇండ్ల కిరణ్, బుద్ధి తిరుపతి, వనదీప్, రుషిదేవ్, మధుకర్, మల్లేష్, శ్రీనివాస్ రావు, చిరంజీవి, అశోక్ కుమార్, సదన్న, రమేష్, శంకర్, పోషం, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.










