బెల్లంపల్లి, శనివారం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి నిర్వహణ తీరును సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా హెడ్ క్వార్టర్స్‌లోని ఆర్ఐ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, స్టోర్ రూమ్, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆర్ఐ సంపత్తో సమావేశమై హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు, విధుల కేటాయింపు, స్పెషల్ పార్టీ సిబ్బంది బాధ్యతలు, ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు.పరిసరాలను పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్ కార్యాలయాలు, హెడ్ క్వార్టర్స్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా, సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూ, విధుల్లో క్రమశిక్షణతో పాటు కార్యాలయ నిర్వహణలో నాణ్యతను పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.










