పుంగనూరు నియోజకవర్గం:పుంగనూరులో ఉద్రిక్తత

0
1

చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. మున్సిపాలిటీలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న రాజంపేట ఎంపీ, వైసీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ దాడిలో వైసీపీ వాహనాలు ధ్వంసం అయ్యాయని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది# కొత్తూరు మురళి .