29వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా టంకాల రవి శంకర్ గుప్త

0
1

వైస్‌ చైర్మన్‌ పదవిపైనా ఆశలు.. ఓటర్ల మద్దతు కోరిన అభ్యర్థి

 

పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో 29వ వార్డు టీడీపీ అభ్యర్థిగా టంకాల రవి శంకర్ గుప్త నామినేషన్ దాకలు చేశారు. కోమటి వీధి, వెట్టిగ వీధి, బ్రాహ్మణ వీధి, కొత్త వీధి, సుబ్బం క్వార్టర్స్‌ పరిధిలోని ఓటర్ల సహకారంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆయన తెలిపారు.

 

టీడీపీ తనకు కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించిందని, వైస్‌ చైర్మన్‌ పదవికి కూడా అవకాశం కల్పించేలా పార్టీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొంటూ, ఓటర్లందరూ తనకు మద్దతుగా నిలిచి గెలిపించాలని రత్నగిరి గుప్తా విజ్ఞప్తి చేశారు.