29వ వార్డులో టీడీపీ విజయమే లక్ష్యం.. మరోసారి ఆశీర్వదించండి!- త్రివేణి మల్లేశ్వరరావు

0
1

పలాస: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 35వ వార్డు ప్రజలు మరోసారి ఆదరించి, భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ అభ్యర్థిని జోగ త్రివేణి మల్లేశ్వరరావు కోరారు. గత ఎన్నికల్లో తనపై నమ్మకంతో ఘన విజయం అందించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చూపిన అభిమానం, నమ్మకం తనకు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లోనూ అదే ఆదరణతో విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ గెలుపునకు స్థానిక నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.