Madanapalle: నామినేషన్ల వేళ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు.

0
3

మదనపల్లి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ హెచ్చరించారు. రాయచోటి, పుంగనూరులో చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలపై వారు తీవ్రంగా స్పందించారు. నామినేషన్ల ప్రక్రియలో మిగిలిన రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాయచోటిలో జరిగిన ఘర్షణలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలపై విచారణ చేపట్టామని డీఐజీ తెలిపారు.