మంచిర్యాల: SRP 3 గనిలో నిర్వహించిన పవిత్ర చండీ హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల మధ్య అమ్మవారికి భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించారు.సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని, గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ఆయురారోగ్యాలతో, సురక్షితంగా విధులు నిర్వహించాలని, వారి కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు. గని పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్కు SCMKS–BMS కార్యవర్గ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. గని అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల శ్రేయస్సు కోసం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.










