దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

0
3

మంచిర్యాల: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ-3 గని ప్రాంగణంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి దివాకర్ రావు, నడిపెల్లి విజిత్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. మంచిర్యాల ప్రాంతం అభివృద్ధి చెందాలని, సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నస్పూర్ పట్టణ మాజీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు పెట్టం స్వరూప–లక్ష్మణ్, గుమ్మడి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు తదితరులు పాల్గొని దుర్గామాతను దర్శించుకున్నారు.దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని, సింగరేణి కార్మికుల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.