AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీ చర్యలను గమనిస్తూ అధికారులను అప్రమత్తం చేయాలని నాయకులకు సూచించారు. ఇవాళ ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నిచోట్లా గెలవాలని, 2024 ఎన్నికలను మించి ఓట్ల శాతం పెరగాలని స్పష్టం చేశారు. కూటమి పార్టీలతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు.










