తెనాలి. సమీపంలోని నందివెలుగు కనకదుర్గమ్మ ఆలయంలో పలువురు సినీ నటులు సందడి చేశారు. ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఆ తరువాత నటులంతా ఆలయ అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు .










