అమ్మాయిల పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఓ కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితుడు ఏకంగా 27 ఇన్స్టా, ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సుమారు 82 మంది అబ్బాయిలను టార్గెట్ చేశాడు. వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను పంపించేలా చాట్ చేసి, వాటిని భద్రపరిచాడు. తర్వాత అమ్మాయి సోదరుడినంటూ బెదిరించి దాదాపు రూ.25 లక్షలకు పైగా వసూలు చేశాడు.










