Tirumala: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన బ్రహ్మోత్సవాలకు ముగింపు ఘట్టమైన చక్రస్నానాన్ని మంగళవారం ఉదయం తిరుమలలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించగా.. వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేదమంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.









