ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి.. కోట్లాది రూపాయలతో రహదారులు, డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు!
కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చొరవతో ఉమ్మడి రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కొత్తూరు గ్రామంలో కోటి రూపాయలతో రహదారి నిర్మాణం, రేగళ్ల–పెద్దతండా, హరియా తండా నుంచి కరకవాగు వరకు రూ.10 కోట్లతో రహదారి నిర్మాణంతో పాటు పలు తండాలను కలుపుతూ రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. అలాగే గ్రామాల్లో డ్రైనేజీ నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు సహకరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.










