విజయదశమి సందర్భంగా ధర్మ కాటా పత్తి కొనుగోలు కేంద్రం ఘన ప్రారంభం!

0
0

విజయదశమి సందర్భంగా ధర్మ కాటా పత్తి కొనుగోలు కేంద్రం ఘన ప్రారంభం!

కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు చేతుల మీదుగా పత్తి కొనుగోళ్లు ప్రారంభం

సుజాతనగర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధర్మ కాటా ప్రైవేట్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్తి వ్యాపారులకు, రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేయర్ మూడు గణేష్, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, వీరాపురం రామ్ లక్ష్మణ్, సైదుబాబుతో పాటు కాంగ్రెస్, సీపీఎం, బీఆర్ఎస్ తదితర పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, వ్యాపారులు పాల్గొన్నారు.

విజయదశమి పర్వదినాన పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం కావడంతో రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.