దసరా ఉత్సవాలు 2026…

0
2

తెనాలి.శ్రీ అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకి యు,ఆది మధ్యంతర హితయు సకల, చరాచర నిగ్రహను గ్రహ సామర్ధ్య దురంధరయు, దుష్ట శిక్షణబద్ధ దీక్ష యు, శ్రీ అసలేధర శతా దివ్య స్వరూపిణీయు, శ్రీ మదకండ భూమండలం మండ మాయమానాంధ్ర వేశాంతర్గత తెనాలి పట్టణ నిధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి,శ్రీ రాజరాజేశ్వరి,శ్రీ విద్య వాసిని అమ్మవార్లకు నవరాత్రి బ్రహ్మోత్సవములు శ్రీ పరాభవ నామ సంవత్సర ఆస్వాయజా  శుద్ధ పాడ్యమి ఆదివారం 11.10.26 మొదలు శుద్ధ నవమి/ దశమి మంగళవారం 20. 10. 26 వరకు అమ్మవార్లను దర్శించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి,తీర్థప్రసాదాలు భక్తులు స్వీకరించినారు. ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ నగరేశ్వర స్వామికి రుద్రాభిషేకములు, నవగ్రహ మండపారాధనలు,అంకురార్పణలు, వాస్తు మండపారాధనలు, నిత్య హోమం,అనుస్థానం లను,కల్పోత విధిగా గాత్రీ కాల అర్చనలను  జరిపినారు. ఆలయ ప్రవేశాలు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తరచి ఉంచినారు. పై కార్యక్రమాల న్నిటికీ ప్రజలందరూ  పాల్గొనారు. ఈరోజు దసరా అవుట వలన స్థానిక బోసు రోడ్డు లోని శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం, దేవి చౌక్ లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం మరియు తెనాలిలో అమ్మవారు దేవస్థానములన్నియు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బోసు రోడ్డు లోని అమ్మవారి దేవస్థానంలో భక్తులకు అన్న వితరణ చేయడం కూడా జరిగినది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి దేవస్థానాల కమిటీ మెంబర్లు ఎంతగానో కృషి చేసి భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా చాలా జాగ్రత్త వహించారు. భక్తులoదరికీ ధన్యవాదాలు తెలిపారు.