ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు.|

0
1

● శామీర్‌పేట్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు

● ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్ష

అల్వాల్, అక్టోబర్ 20: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

మంగళవారం శామీర్‌పేట్‌లోని తన నివాసంలో సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. 

రాష్ట్ర ప్రజలందరూ పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భవానీ అమ్మవారిని, జమ్మి చెట్టును ప్రార్థించినట్లు తెలిపారు.

#Sidhumaroju

Alwal