నిజామాబాద్‌లోని ఇంద్రప్రస్థ నగర్ కాలనీలో ఓం శ్రీ మనయుత్త్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో మండపం భక్తిమయంగా మారింది.










