అమరవీరుల త్యాగానికి రక్తదానంతో నివాళి.|

0
7

● సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

● రెడ్‌క్రాస్‌కు 44, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు 33 యూనిట్ల రక్తం అందజేత

● సీపీ డా. ఎం. రమేశ్‌తో పాటు అధికారుల రక్తదానం

అల్వాల్, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 

దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఘన నివాళిగా చేపట్టిన ఈ కార్యక్రమం మానవత్వం, సేవాభావం, సమాజం పట్ల బాధ్యతను చాటిచెప్పింది.

రక్తదానం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుతూ అమరవీరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించాలనే సందేశాన్ని ఈ శిబిరం అందించింది. 

ఇందులో సేకరించిన రక్తంలో 44 యూనిట్లను రెడ్‌క్రాస్ సంస్థకు, 33 యూనిట్లను ఎన్టీఆర్ ట్రస్ట్‌కు అందజేశారు. మొత్తం 77 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేశ్, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. 

అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవలోనూ ముందుండాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

#Sidhumaroju

Alwal