పలాస కాశీబుగ్గ 12వ వార్డు భవిష్యత్తుకు యువకిరణం – జనసేన అభ్యర్థి ప్రదీప్ కుమార్

0
1

“మార్పు మనతోనే మొదలవుతుంది” – నిజాయితీ గల నాయకత్వానికి ఓటర్లకు పిలుపు

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 12వ వార్డు భవిష్యత్తును, మున్సిపాలిటీ ప్రగతిని నిర్ణయించే సువర్ణావకాశం ఓటర్ల ముందు నిలిచింది. జనసేన పార్టీ తరఫున బరిలో నిలిచిన యువనేత ప్రదీప్ కుమార్ సర్పవరపు గారిని గెలిపించి, చట్టసభల్లో నిజాయితీ గల గొంతుకను వినిపించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

“గమ్యం ముఖ్యం కాదు, గమ్యానికి నడిపించే దారి, ఆ దారిలో నడిచే నాయకుడి అడుగుల తీరు ముఖ్యం” అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఇంట, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో చిరునవ్వుల చిరుదీపాలు వెలగాలంటే చీకటిని చీల్చే సరికొత్త కిరణం తోడుండాలని, ఆ కిరణమే ప్రదీప్ కుమార్ అని అభిప్రాయపడ్డారు.

ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి; కానీ ప్రజలు వేసే ప్రతి ఓటు వార్డు, మున్సిపాలిటీ తలరాతను మారుస్తుందని గుర్తుచేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా, ఆ హక్కును సమర్థుడు, నీతి నిజాయతీ నిబద్ధత గల నాయకుడి చేతిలో పెట్టినప్పుడే అభివృద్ధికి బాటలు పడతాయని తెలిపారు.

రేపటి తరాల చిరునవ్వుల కోసం ఈ చైతన్య యాత్రలో ప్రజల ఆశీర్వాదాలతో ప్రదీప్ కుమార్ సర్పవరపు గారిని గెలిపించాలని కోరారు. “మార్పునకు నాంది పలుకుదాం” అంటూ పిలుపునిచ్చారు.