పాలపిట్ట విడుదల ఘటనపై కేసు నమోదు

0
1

దసరా వేడుకల్లో పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్ మినీ స్టేడియంలో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.

 

ఈ ఘటనలో ఉప్పల్కు చెందిన ఈగ చంద్రశేఖర్, పి. పరమేశ్వర్రెడ్డి, మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని మేడ్చల్-మల్కాజ్గరి జిల్లా అటవీ అధికారి వేణుమాధవ్ తెలిపారు.

 

వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని సంబంధిత సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద అక్టోబర్ 21న POR నం. 16-03/2025-26తో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. విచారణ పూర్తయ్యాక చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని, నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామని వెల్లడించారు.