దేవినూతల ఎంపీటీసీ అభ్యర్థిగా మల్లవరపు పద్మ నామినేషన్ దాఖలు

0
4

చీరాల: దేవినూతల కూటమి పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా మల్లవరపు పద్మ గురువారం చీరాల మండల కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వన్ ప్లస్ టు సభ్యులుగా దేవినూతల గ్రామ పార్టీ అధ్యక్షుడు గోనబోయిన ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ గవిని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా తనకు ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య (కొండయ్య)కు మల్లవరపు పద్మ కృతజ్ఞతలు తెలిపారు.