38వ రోజుకు చేరిన తెలంగాణ ఉద్యమకారుల రిలే నిరాహార దీక్షలు.|

0
4

● ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్

అల్వాల్, అక్టోబర్ 24:తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 38వ రోజుకు చేరుకున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలక పాత్ర పోషించి, ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని దీక్షా శిబిరం వేదికగా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి తగిన గౌరవం కల్పించాలని, వారి సంక్షేమానికి సంబంధించిన విధివిధానాలను త్వరితగతిన ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అర్హులైన ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

38వ రోజు దీక్షలో పాసుల ముత్యాలు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో పటోళ్ల సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, దయాకర్, రామయ్య, సంగమేశ్వర్, రమేష్, కృష్ణారావు తదితరులు ఉద్యమకారులకు మద్దతుగా నిలిచారు.

#Sidhumaroju

Alwal