కాకర్ల అయ్యప్ప సెంటర్‌లో దేవి నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి హుండీ వేలంలో రూ.7,100కు దక్కించుకున్న దాసోజు రాంబ్రహ్మం!

0
3

కాకర్ల అయ్యప్ప సెంటర్‌లో దేవి నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి హుండీ వేలంలో రూ.7,100కు దక్కించుకున్న దాసోజు రాంబ్రహ్మం!

భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అమ్మవారి నవరాత్రి వేడుకలు

జూలూరుపాడు, అక్టోబర్ 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన యల్లంకి కమలాకర్ గారి ప్రాంగణంలోని అయ్యప్ప సెంటర్‌లో అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి హుండీ వేలం నిర్వహించారు.

ఈ వేలంలో దాసోజు రాంబ్రహ్మం గారు రూ.7,100కు అమ్మవారి హుండీని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమం నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

కాకర్ల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు భక్తులలో భక్తిభావాన్ని నింపుతున్నాయి.