24 ఏళ్లకే ఛైర్పర్సన్.. పాలిటిక్స్లోలోకి వచ్చిన 10 రోజులకే..

0
3

AP: కడప(D) రాజంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్గా 24 ఏళ్ల దొంతం గాయత్రి (TDP) ఏకగ్రీవమయ్యారు. దీంతో రాష్ట్రంలో ఈ పదవి చేపట్టనున్న అతిపిన్న వయస్కురాలిగా ఆమె నిలవనున్నారు. మరో విశేషం ఏమిటంటే.. గాయత్రి రాజకీయ అరంగేట్రం చేసి 10రోజులే అయింది. ఈ ఏడాదే వైద్య విద్య (BDS) పూర్తి చేసిన ఆమె అనూహ్యంగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె తండ్రి దొంతం శివప్రసాద్ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ TDP అధికార ప్రతినిధి.