ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పాటి బండ్ల దక్షిణామూర్తి పార్థవదేహాన్ని రాష్ట్ర మంత్రి,తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ సందర్శించి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్య రంగంలో పాటి బండ్ల దక్షిణామూర్తి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మరణం వైద్య రంగానికి ఎనలేని తీరని లోటు అని పేర్కొన్నారు.










