తెనాలిలో తుఫాను ప్రభావం కనిపిస్తుంది. మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమైన తొలకరి జల్లులు కాసేపటికే ఈదురు గాలులతో కూడిన వర్షంగా మారిoదీ.వర్షం నిరంతరాయంగా కురుస్తుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న గృహాల వద్ద ఉండవద్దని సూచిస్తున్నారు. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల అప్రమత్తంగా ఉండి నీటి నిలవలు తొలగించే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలనీ అధికారులు సూచించారు. తుఫాను ఎఫెక్ట్ కు కూలిన చెట్లను వెంటనే తొలగించాలి, పారిశుద్ధ్య తాగు నీటిని ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు.










