ఆసిఫాబాద్ లుంబిని దీక్షాభూమిలో ఘనంగా ధమ్మచక్ర ప్రవర్తన్ దివస్ భారీగా తరలివచ్చిన 69 గ్రామాల ప్రజలు

0
5

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ 

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షాభూమి కేంద్ర కమిటీ ప్రత్యేక ఆధ్వర్యంలో ధమ్మచక్ర ప్రవర్తన్ దివస్ వేడుకలు అత్యంత వైభవంగా, జనసందోహం మధ్య జరిగాయి. 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లోని పవిత్ర దీక్షాభూమిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధధమ్మాన్ని స్వీకరించి దేశంలో సామాజిక సమానత్వ విప్లవానికి నాంది పలికిన చారిత్రాత్మక ఘట్టాన్ని స్మరిస్తూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమతా సైనిక్ దళ్ నేత, ప్రముఖ సామాజిక గాయకుడు రేంజర్ల రాజేష్ విచ్చేశారు. గౌరవ అతిథులుగా స్థానిక శాసనసభ్యురాలు కోవ లక్ష్మి, డిసిసి  అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జిల్లా గ్రంథలయం సంస్థ చైర్మన్ కాంబ్లే అనిల్ కుమార్, మరియు మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్  వైస్ చేర్మన్ అహ్మద్ మరియు ముఖ్య మాఖ్యనాయకులు  హాజరయ్యారు. లుంబిని దీక్షాభూమి కేంద్ర కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు నవాయన బౌద్ధ ఉద్యమానికి, సామాజిక సమానత్వానికి సగర్వ చిహ్నమైన నీలి రంగు జెండాను గౌరవపూర్వకంగా ఆవిష్కరించారు. అనంతరం బుద్ధ వందనం, పంచశీల ప్రార్థనలు నిర్వహించి భారీ సంఖ్యలో 70 మీటర్ల  పొడువు బుద్ధ జెండాతో భారీ ర్యాలీ కార్యక్రమం నిరహించారు 

ఈ సందర్భంగా ముఖ్యఅతిథి రేంజర్ల రాజేష్ మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం, కుల రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ బౌద్ధ ధమ్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ అందించన 22 ప్రతిజ్ఞలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. తన విప్లవాత్మక గళంతో రాజేష్ పాడిన అంబేద్కర్ గీతాలు బౌద్ధ అనుయాయులలో గొప్ప ఉత్సాహాన్ని నింపాయి.

ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షులు దుర్గం హోక్టు,సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు అశోక్ట్  సెంటర్ కమిటీ ప్రసిడెంట్ ప్రశాంత్, ఉపాధ్యక్షులు చంద్రి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్, మరియు లుంబిని దీక్షాభూమి అధ్యక్షులు తుకారాం ప్రధాన కార్యదర్శి రాజకుమార్  కమిటీ సభ్యులు  ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలలోని 69 గ్రామాల ప్రజలు, మహిళలు, యువకులు, బౌద్ధ అనుయాయులు సాంప్రదాయ ఉత్తరీయాలు ధరించి భారీ ర్యాలీ లో పాల్గొన్నారు ఆతరం కావ్వాలి కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారు. జై భీమ్, ‘నమో బుద్ధాయ’ నినాదాలతో లుంబిని దీక్షాభూమి ప్రాంగణమంతా మరుమోగింది.